వరల్డ్‌కప్ ఫేవరెట్స్ ఎవరు.. కోహ్లి మాట ఇదీ!

Thu,March 14, 2019 12:40 PM

No Team starts as favourite for World Cup says Virat Kohli

న్యూఢిల్లీ: వరల్డ్‌కప్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇప్పటికే చాలా మంది ఈ మెగా టోర్నీలో ఎవరు ఫేవరెట్స్ అన్నదానిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా వరల్డ్‌కప్ ఫేవరెట్స్‌పై స్పందించాడు. అందరూ ఈ టోర్నీలో టీమిండియానే ఫేవరెట్ అని అంటున్నా.. కోహ్లి మాత్రం దానిని అంగీకరించడం లేదు. ఈ మెగా టోర్నీకి ముందు ఆడిన చివరి వన్డే సిరీస్‌లో టీమిండియాకు ఓటమి తప్పని విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా చేతిలో కోహ్లి సేన 2-3 తేడాతో ఓడిపోయింది. ఈ సిరీస్ ఓటమి తర్వాత కోహ్లి మీడియాతో మాట్లాడుతూ.. వరల్డ్‌కప్‌పై స్పందించాడు. అసలు వరల్డ్‌కప్‌లో ఫేవరెట్స్ అంటూ ఎవరూ లేరని కోహ్లి స్పష్టం చేశాడు.

వరల్డ్‌కప్‌లో ప్రతి టీమూ ఓ ముప్పే. ఓ టీమ్ వరల్డ్‌కప్‌లో బాగా ఆడటం మొదలుపెట్టింది అంటే.. వాళ్లను ఆపడం చాలా చాలా కష్టం అని కోహ్లి అన్నాడు. ఇక అలాంటి టీమ్ కూడా సెమీస్‌లో ఇంటిదారి పట్టే అవకాశం ఉంది. ఆ రోజు ఆ టీమ్ కంటే బాగా ఆడే టీమ్ తగిలితే.. ఓటమి తప్పదు. అందువల్ల వరల్డ్‌కప్‌ను ఫేవరెట్స్‌గా ఏ టీమ్ కూడా మొదలుపెట్టదు. ఏ టీమ్ అయినా ప్రమాదకరమే. వెస్టిండీస్ టీమ్ ఎలా మారిందో మనం చూశాం. ఆ టీమ్ కూడా వరల్డ్‌కప్‌లో ప్రమాదకరమే. ఇంగ్లండ్ కూడా చాలా బలమైన జట్టే. ఆస్ట్రేలియా ఇప్పుడు చాలా సమతౌల్యంతో కనిపిస్తున్నది. మాది కూడా బలమైన జట్టే. న్యూజిలాండ్ టీమ్ బాగుంది. ఇక పాకిస్థాన్ అయితే తమదైన రోజున ఏ టీమ్‌నైనా ఓడించగలదు అని కోహ్లి అన్నాడు.

3369
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles