కుక్ టీమ్‌లో సచిన్, ద్రవిడ్‌లకు నో చాన్స్!

Wed,September 5, 2018 04:57 PM

No place for Sachin Tendulkar and Rahul Dravid in Alistair Cooks all time XI

లండన్: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ ఓపెనర్ అలిస్టర్ కుక్ ఆల్‌టైమ్ బెస్ట్ టెస్ట్ టీమ్‌లో ఇండియన్ గ్రేట్స్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లకు చోటు దక్కలేదు. టీమ్‌లో ఒక్క గ్రాహం గూచ్ తప్ప మిగతా వాళ్లందరూ కుక్‌తో ఆడిన వాళ్లే కావడం విశేషం. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ యూట్యూబ్ చానెల్‌లో కుక్ తన టీమ్ గురించి చెబుతున్న వీడియోను పోస్ట్ చేశారు. ఇంగ్లండ్ లెజెండరీ ప్లేయర్ గూచ్‌నే తన టీమ్‌కు కెప్టెన్ అని కుక్ చెప్పాడు. అతనితోపాటు మరో ఓపెనర్‌గా మాథ్యూ హేడెన్.. మిడిలార్డర్‌లో పాంటింగ్, లారా, ఏబీ డివిలియర్స్, కుమార సంగక్కర, కలిస్‌లను ఎంపిక చేశాడు. బౌలర్లలో మురళీధరన్, షేన్ వార్న్, జేమ్స్ ఆండర్సన్, గ్లెన్ మెక్‌గ్రాత్ ఉన్నారు.

అయితే ఈ టీమ్‌లో ఒక్క ఇండియన్ ప్లేయర్‌కు కూడా కుక్ చాన్స్ ఇవ్వలేదు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్‌గానీ, టీమిండియా మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌కు చోటు దక్కకపోవడంపై క్రికెట్ పండితులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. టీమిండియాతో జరగబోయే ఐదో టెస్టే తన కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని కుక్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ తరఫున అత్యధికంగా 160 టెస్టులాడిన కుక్.. 44.88 సగటుతో 12254 పరుగులు చేశాడు.

3696
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles