నువ్వేంది మాకు చెప్పేది.. అఫ్రిదికి సచిన్ కౌంటర్

Thu,April 5, 2018 01:26 PM

న్యూఢిల్లీ: కశ్మీర్ అంశంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి పంచ్‌ల మీద పంచ్‌లు పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కోహ్లి, గంభీర్, రైనా, కపిల్‌దేవ్‌లాంటి ఇండియన్ క్రికెటర్లు ఘాటైన కామెంట్స్‌తో అఫ్రిదిని ఉక్కిరిబిక్కిరి చేశారు. తాజాగా సచిన్ టెండూల్కర్ కూడా అఫ్రిదికి కౌంటర్ వేశాడు. మేం ఏం చేయాలో బయటి వ్యక్తులు చెప్పాల్సిన అవసరం లేదని మాస్టర్ అన్నాడు. అఫ్రిది వ్యాఖ్యలను అతను తీవ్రంగా ఖండించాడు. మా దేశాన్ని ఎలా నడపాలో మాకు తెలుసు. మాకు ఆ సామర్థ్యం ఉంది అని మాస్టర్ అన్నాడు. కశ్మీర్‌లో స్వీయ నిర్ణయాధికారం, స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న అమాయకులను అణచివేస్తున్నారని, ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని అఫ్రిది డిమాండ్ చేశాడు. అయితే అతని వ్యాఖ్యలను గంభీర్, కోహ్లి, రైనా, కపిల్ దేవ్ ఖండించారు. కపిల్ అయితే.. అఫ్రిది ఎవరు, ఇలాంటి వాళ్లకు ఎందుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు? ఏదో ఒక మూల కూర్చుని మాట్లాడే ఇలాంటి వాళ్లపై స్పందించకపోవడమే ఉత్తమం అని కపిల్ అన్నాడు.

5009
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles