ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ రద్దు

Fri,February 22, 2019 04:06 PM

No IPL opening ceremony this time as BCCI decides to donate that amount to Pulwama martyrs kin

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఐపీఎల్ 12వ ఎడిషన్ ఓపెనింగ్ సెర్మనీ రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ సెర్మనీ కోసం వెచ్చించే డబ్బును దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ఇవ్వనున్నట్లు సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు. శుక్రవారం బీసీసీఐ, సీఓఏ అధికారులు ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐపీఎల్‌కు చెందిన సీనియర్ అధికారి ఈ ఐడియాను సీఓఏ సభ్యులతో పంచుకున్నారు. దీనికి సీఓఏతోపాటు బీసీసీఐ అధికారులు కూడా అంగీకరించారు. ఈ నిర్ణయం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అమర వీరుల ప్రాణాలను తిరిగి తీసుకురాలేం. కానీ ఓ సంస్థగా ఆ అమర వీరుల కుటుంబాల బాధ్యతను తీసుకోవాలని భావించాం అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఈ ఐడియా ఇచ్చింది తాను అని ఎవరికీ చెప్పకూడదని సదరు ఐపీఎల్ అధికారి కోరినట్లు ఆయన చెప్పారు.


1438
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles