ఆస్ట్రేలియా గడ్డపై కింగ్ కోహ్లీ రికార్డులు ఇవే..!

Sun,December 16, 2018 10:57 AM

No Asian batsman has previously scored Test 100s in SA, Eng, Aus in the same calendar year

పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో భారత సారథి విరాట్ కోహ్లీ ఎవరికీ సాధ్యం కాని రికార్డులు నెలకొల్పుతున్నాడు. ఆసీస్‌తో రెండో టెస్టులో కోహ్లీ చేసిన సెంచరీ.. టెస్టు క్రికెట్లో అతనికి 25వది కావడం విశేషం. అద్భుతంగా రాణిస్తున్న రన్ మెషీన్‌కు ఈ ఏడాదిలో ఇది ఐదో టెస్టు శతకం. మొత్తంగా ఆసీస్‌తో సిరీస్‌లో విరాట్‌కిది ఏడో టెస్టు శతకం. ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 6 శతకాలు సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై తాజా సెంచరీతో కోహ్లీ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. 30ఏళ్ల కోహ్లీ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 11 సెంచరీలు చేశాడు. 127 ఇన్నింగ్స్‌ల్లోనే 25 టెస్టు సెంచరీలు చేసిన అతడు దిగ్గజాల సరసన చేరాడు. కోహ్లీ కన్నా ముందు గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే అతి తక్కువగా 68 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకున్నాడు.

ఆ మూడు దేశాల్లో సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ కోహ్లీ


సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఒకే కేలండర్ ఇయర్‌లో టెస్టుల్లో సెంచరీలు బాదిన ఏకైక ఆసియా క్రికెటర్ కోహ్లీనే. ఈ ఫీట్‌ను ఇప్పటివరకు ఏ ఆసియా ఆటగాడు సాధించలేదు. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ 2018 ఏడాదిలో ఇప్పటి వరకు 1216 పరుగులతో రాబట్టాడు. గతంలో 2016లో 1215పరుగులు, 2017లో 1059 పరుగులు, 2014లో 847 పరుగులతో మెరిశాడు.

3515
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles