ఉత్కంఠ పోరు.. రాణా ఔట్

Fri,May 25, 2018 09:56 PM

Nitish Rana run out

కోల్‌కతా: క్వాలిఫయర్-2లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ క్రిస్‌లిన్ వేగంగా ఆడుతున్నాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్(26: 13 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్) క్రీజులో ఉన్నంతసేపు వీరవిహారం చేశాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణా(22) సహకారం అందిస్తూ చెత్త బంతులను అలవోకగా స్టాండ్స్‌లోకి పంపే ప్రయత్నం చేశాడు. సాధించాల్సిన లక్ష్యం భారీగా లేకపోవడంతో ఆచితూచి ఆడుతున్నారు. షకిబ్ బౌలింగ్‌లో రాణా రనౌటయ్యాడు. సన్‌రైజర్స్ పేసర్లు కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో విఫలమవుతున్నారు. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రిస్‌లిన్(37), ఉత‌ప్ప‌(1) క్రీజులో ఉన్నారు. కోల్‌కతా విజయానికి ఇంకా 66 బంతుల్లో 87 పరుగులు చేయాల్సి ఉంది.

అంతకుముందు వృద్ధిమాన్ సాహా(35: 27 బంతుల్లో 5ఫోర్లు), శిఖర్ ధావన్(34: 24 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్), రషీద్ ఖాన్(34 నాటౌట్: 10 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు చేసింది.

3359
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles