రాష్ట్ర‌ప‌తికి ఓ రూల్‌.. మాకో రూలా?

Thu,June 29, 2017 03:04 PM

Niranjan Shah upset over age limit of BCCI Office bearers

ముంబై: బీసీసీఐ మాజీ కార్య‌ద‌ర్శి నిరంజ‌న్ షా ఓ కొత్త లాజిక్‌ను తెర‌పైకి తీసుకొచ్చారు. బోర్డులో 70 ఏళ్ల‌కుపైబ‌డిన వ్య‌క్తులు ఉండ‌కూడ‌ద‌న్న లోధా క‌మిటీ సిఫార‌సును ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. 70 ఏళ్ల‌కు పైబ‌డిన వ్య‌క్తి భార‌త రాష్ట్ర‌ప‌తి (ప్ర‌ణ‌బ్ వ‌య‌సు 81 ఏళ్లు)గా ఉండొచ్చుగానీ.. బీసీసీఐలో మాత్రం ఉండ‌కూడ‌దా అని ప్ర‌శ్నించారు. విచిత్రంగా అదే లోధా సిఫార‌సుల‌ను బోర్డులో అమలు చేయ‌డానికి ఏర్పాటు చేసిన క‌మిటీలో 74 ఏళ్ల నిరంజ‌న్‌షా కూడా స‌భ్యుడే. ఇదే విష‌యాన్ని ప్ర‌శ్నించ‌గా.. ఆయ‌న ఇలా స్పందించారు. బీసీసీఐ ఆఫీస్ బేరర్ల వ‌య‌సు ప‌రిమితిపై ఈ ఏడుపేంటో అర్థం కాదు. రాష్ట్ర‌ప‌తే 70 ఏళ్ల‌కు పైబ‌డిన వాళ్లు ఉన్నారు క‌దా. బోర్డులో ఉంటే త‌ప్పేంటి? మ‌నం ఫిట్‌గా ఉన్నంత వ‌ర‌కు ఏ ప‌నైనా చేయొచ్చు. ఇది క‌చ్చితంగా వివ‌క్షే అని షా అన్నారు.

ఈ క‌మిటీలో నేను ఉండ‌టం వ‌ల్ల లోధా సిఫార‌సుల‌పై గ‌తంలో చ‌ర్చించిన అనుభ‌వం మిగ‌తా వాళ్ల‌కు ప‌నికొస్తుందని ఆయ‌న చెప్పారు. వ‌య‌సు ప‌రిమితితోపాటు ఒకే రాష్ట్రానికి, ఒకే ఓటు అన్న సిఫార‌సును కూడా షా వ్య‌తిరేకిస్తున్నారు. ఇలా అయితే త‌న సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్‌కు కూడా న‌ష్టం జ‌రుగుతుంది. వ్య‌క్తిగ‌తంగా నేను దీనికి వ్య‌తిరేకం కాను. అయితే ఈ సిఫార‌సు అమ‌లు చేయ‌డం వ‌ల్ల దేశంలోని ఎంతో పేరున్న సౌరాష్ట్ర‌, ముంబైలాంటి అసోసియేష‌న్లు కూడా ఓటు హ‌క్కు కోల్పోతాయి అని షా అన్నారు. ఇక బోర్డులో రెండు వేర్వేరు ప‌ద‌వుల‌ను చేపట్ట‌డానికి మ‌ధ్య మూడేళ్ల గ్యాప్ ఉండాల‌న్న సిఫార‌సును ఆయ‌న వ్య‌తిరేకించారు. అదెలా సాధ్యం. జాయింట్ సెక్ర‌ట‌రీగా ఉన్న వ్య‌క్తి.. త‌ర్వాత సెక్ర‌ట‌రీ అవ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. దీనివ‌ల్ల బోర్డులో ప‌ద‌వుల మార్పుతోపాటు ఒక కొన‌సాగింపు ఉంటుంది అని షా అన్నారు.

2846
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles