వరల్డ్‌కప్ ఫైనల్.. ఇంగ్లండ్ విజయలక్ష్యం 242..

Sun,July 14, 2019 07:20 PM

newzealand made 241 runs against england in world cup final match

లండన్: లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్‌మెన్లలో హెన్రీ నికోల్స్ (77 బంతుల్లో 55 పరుగులు, 4 ఫోర్లు), టామ్ లాథమ్ (56 బంతుల్లో 47 పరుగులు, 2 ఫోర్లు, 1 సిక్సర్)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఇక మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగిన స్కోరు చేయలేదు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లియామ్ ప్లంకెట్‌లకు చెరో 3 వికెట్లు దక్కగా, జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్‌లు చెరొక వికెట్ పడగొట్టారు.

985
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles