కష్టాల్లో కివీస్.. 27 ఓవర్లలో స్కోరు 118/3..

Sun,July 14, 2019 05:23 PM

newzealand lost 3 wickets against england in world cup 2019 final match

లండన్: లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. ఆ జట్టు 27 ఓవర్లలో 118 పరుగులు చేసి 3 కీలక వికెట్లను కోల్పోయింది. మొదట మార్టిన్ గప్తిల్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగ్గా, అనంతరం కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్లంకెట్ బౌలింగ్‌లో జాస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరువాత హెన్రీ నికోల్స్ ప్లంకెట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం రాస్ టేలర్, టామ్ లాథమ్‌లు క్రీజులో ఉన్నారు.

690
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles