రిజ‌ర్వ్‌డే సెమీస్‌.. ఇండియా టార్గెట్ 240

Wed,July 10, 2019 03:24 PM

New Zealand sets 240 target for India in World cup Semifinals

హైద‌రాబాద్‌: వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భార‌త్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్లో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌కు 239 ర‌న్స్ చేసింది. రిజ‌ర్వ్‌డే రోజున 23 బంతుల్లో న్యూజిలాండ్ మ‌రో మూడు వికెట్లు కోల్పోయి 28 ర‌న్స్ జోడించింది. దీంతో భార‌త్‌కు 240 ప‌రుగుల ల‌క్ష్యాన్ని విధించింది కివీస్‌. భార‌త బౌల‌ర్లు బుమ్రా(1/39), భువ‌నేశ్వ‌ర్‌(3/43)లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. ర‌వీంద్ర జ‌డేజా ఇవాళ కూడా త‌న టాలెంట్ చూపించాడు. నిన్న అద్భుత‌మైన బంతితో నికోల‌స్‌ను బౌల్డ్ చేసిన జ‌డేజా.. ఇవాళ డీప్ మిడ్‌వికెట్ నుంచి నేరుగా వికెట్ల మీద‌కు త్రో చేసి టేల‌ర్‌ను ర‌నౌట్ చేశాడు. సుమారు 40 అడుగుల దూరం నుంచి జ‌డేజా డైర‌క్ట్‌గా వికెట్ల‌ను కొట్ట‌డం విశేషం.

టేల‌ర్ 90 బంతుల్లో ఒక సిక్స‌ర్‌, మూడు ఫోర్ల‌తో 74 ర‌న్స్ చేశాడు. మ‌రో ప్లేయ‌ర్ లాథ‌మ్ కొట్టిన భారీ షాట్‌ను డీప్‌లో జ‌డేజా అద్భుతంగా అందుకున్నాడు. బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ రిజ‌ర్వ్‌డే రోజున జడేజా త‌న నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించాడు. భువ‌నేశ్వ‌ర్ బౌలింగ్‌తో రిజ‌ర్వ్‌డే స్టార్ట్ అయ్యింది. మంగ‌ళ‌వారం కివీస్ ఇన్నింగ్స్ 46.1 ఓవ‌ర్ల వ‌ద్ద వ‌ర్షం కార‌ణంగా నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో ఓ సెమీఫైన‌ల్ మ్యాచ్ రిజ‌ర్వ్‌డే రోజున ఆడ‌డం ఇదేమొద‌టిసారి.1456
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles