అచ్చూ అమ్మాయిల్లాగే.. రోహిత్ సేన చిత్తు చిత్తు

Wed,February 6, 2019 03:51 PM

New Zealand Beat India by 80 runs in First T20

వెల్లింగ్టన్: భారత అమ్మాయిల్లాగే న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో రోహిత్ సేన చిత్తుచిత్తుగా ఓడింది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 19.2 ఓవర్లలో 139 పరుగులకే చేతులెత్తేసింది. 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన రోహిత్ సేన అసలు ఏ టైమ్‌లోనూ గెలిచేలా కనిపించలేదు. 18 పరుగుల దగ్గరే రోహిత్ శర్మ (1) వికెట్ కోల్పోయిన భారత్.. ఇక ఏ దశలోనూ కోలుకోలేదు. ధావన్ (29), శంకర్ (27), పంత్ (5), కార్తీక్ (5), హార్దిక్ పాండ్యా (4) దారుణంగా విఫలమయ్యారు. ధోనీ 39 పరుగులు చేసి ఔటయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ 3, ఫెర్గూసన్, సోధి, సాంట్నర్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. టీ20ల్లో ప‌రుగుల ప‌రంగా టీమిండియాకు ఇదే అత్యంత చెత్త ఓట‌మి కావ‌డం విశేషం.


అంత‌కుముందు భారత బౌలర్లను చితగ్గొట్టిన కివీస్ బ్యాట్స్‌మెన్.. బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఓపెనర్ సీఫర్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 43 బంతుల్లో 6 సిక్సర్లు, 7 ఫోర్లతో 84 పరుగులు చేశాడు. అతనికి మన్రో, విలియమ్సన్ కూడా తోడవడంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 14 సిక్స్‌లు, 14 ఫోర్లు నమోదు కావడం విశేషం. కివీస్ హిట్టింగ్ ధాటికి భారత బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీసినా.. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 51 పరుగులు ఇవ్వడం విశేషం. ైస్ట్రెక్ బౌలర్ భువనేశ్వర్ కూడా 4 ఓవర్లలో 47 పరుగులు, ఖలీల్ అహ్మద్ 48 పరుగులు ఇచ్చారు. మన్రో 34, విలియమ్సన్ 34, చివర్లో కుగెలీన్ కేవలం 7 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు.

2913
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles