కాల్పుల దృష్ట్యా మూడో టెస్ట్ మ్యాచ్ ర‌ద్దు

Fri,March 15, 2019 10:27 AM

New Zealand, Bangladesh Third Test Called Off

రేపు క్రైస్ట్ చ‌ర్చ్‌లోని హ‌గ్లే ఓవ‌ల్‌లో న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన మూడో టెస్ట్‌ మ్యాచ్ ర‌ద్ధ‌యింది. క్రైస్ట్‌చర్చ్‌ సెంట్రల్‌ సిటీలోని ప్రార్ధ‌నా మందిరంలో జరిగిన కాల్పుల నేప‌థ్యంలో భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా మ్యాచ్‌ని ర‌ద్దు చేశారు. న్యూజిలాండ్ క్రికెట్ టీం త‌మ అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. కాల్పుల‌లో మ‌ర‌ణించిన వారికి సంతాపం తెలియ‌జేసింది. కాగా, ప్రార్ధ‌న కోసం బంగ్లా ఆట‌గాళ్ళు కూడా మ‌సీదుకి వెళ్ళ‌గా కాల్పుల మోత‌ విన్న‌ వారు బ‌స్సులోనే ఉండ‌డంతో పెద్ద ప్ర‌మాదం నుండి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. బంగ్లా త‌మీమ్ ఇక్భాల్ తో పాటు ఆ దేశ క్రికెట్ బోర్డ్ కూడా అల్లా ద‌య వ‌ల‌న ఆట‌గాళ్ళ‌కి ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని పేర్కొన్నారు. న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల‌లో కివీస్ భారీ విజ‌యం సాధించి సిరీస్‌లో 2-0తో నిలిచిన సంగ‌తి తెలిసిందే.1137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles