కుప్పకూలిన కివీస్.. భారత్ టార్గెట్ 158

Wed,January 23, 2019 10:37 AM

నేపియర్:ఆస్ట్రేలియా పర్యటనలో ప్రదర్శించిన జోరునే టీమిండియా బౌలర్లు న్యూజిలాండ్‌తో టూర్‌లోనూ కొనసాగించారు. సొంతగడ్డపై బలమైన కివీస్ జట్టును స్వల్ప స్కోరుకే కుప్పకూల్చారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్(4/39), షమీ(3/19), చాహల్(2/43) అనూహ్య బౌలింగ్‌తో సత్తాచాటడంతో న్యూజిలాండ్ 38 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. కివీస్ సారథి కేన్ విలియమ్సన్(64: 81 బంతుల్లో 7ఫోర్లు) ఒక్కడే అర్ధశతకంతో రాణించడంతో ఆ జట్టు ఆమాత్రం స్కోరు చేయగలిగింది. రాస్ టేలర్(24) పరుగులు సాధించేందుకు ప్రయత్నించినా బౌలర్లు నిలవనీయలేదు. సొంత గడ్డపై గొప్ప రికార్డు కలిగిన బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. స్టార్ ప్లేయర్స్ మార్టిన్ గప్తిల్(5), మున్రో(8), టామ్ లాథమ్(11), హెన్రీ నికోల్స్(12) నిరాశపరిచారు.


ఇన్నింగ్స్ ఆరంభం నుంచి పేసర్లు, స్పిన్నర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంతో కివీస్ కుదేలైంది. ఏ దశలోనూ కోలుకోకుండా ఊహించని దెబ్బ తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు షమీ ఆరంభంలోనే షాకిచ్చాడు. ఓపెనర్లిద్దరినీ ఔట్ చేసి భార‌త్‌కు శుభారంభం అందించాడు. యువ స్పిన్నర్ చాహల్ అద్భుతంగా బంతులేస్తూ .. రెండు కళ్లు చెదిరే రిటర్న్ క్యాచ్‌లు అందుకున్నాడు. ఆఖర్లో కుల్దీప్ టెయిలెండర్ల వికెట్లను ఆడుతూ పాడుతూ తీశాడు. మ్యాచ్ ఆద్యంతం భారత్ ఆధిపత్యం కొనసాగింది. భారత ఆటగాళ్లు మైదానంలో చిరునవ్వులు చిందిస్తూ సరదాగా మ్యాచ్ ఆడారు.

2976
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles