ఆసియా గేమ్స్‌లో పతాకధారిగా నీరజ్

Fri,August 10, 2018 03:11 PM

Neeraj Chopra to be Indias flag-bearer at Asian Games 2018

న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. ఆసియా గేమ్స్‌లో భారత పతాకధారిగా(ఫ్లాగ్‌బేరర్) నీరజ్ వ్యవహరించనున్నాడు. త్వరలో ఇండోనేషియాలో జరగనున్న ఆసియా క్రీడలు-2018 ఆరంభ వేడుకల్లో నీరజ్ మువ్వన్నెల జెండాతో భారత బృందం ముందు నడవనున్నాడు. ప్రతిష్టాత్మక క్రీడల్లో నీరజ్ భారత బృందానికి నాయకత్వం వహిస్తాడని భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా శుక్రవారం వెల్లడించారు. 20ఏళ్ల‌ నీరజ్ ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ క్రీడ‌ల్లో ఏ ఒక్క భార‌త జావెలిన్ త్రోయ‌ర్ కూడా బంగారు ప‌త‌కం కొల్ల‌గొట్ట‌లేదు. చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయాల‌ని చోప్రా ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. వచ్చే ఆసియా గేమ్స్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణపతకంతో మెరుస్తాడని భారత అభిమానులు ఆశిస్తున్నారు.

1337
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles