లైయన్ గర్జన.. పాక్ చిత్తు

Mon,December 2, 2019 04:54 PM

అడిలైడ్: ఆస్ట్రేలియాతో ఆఖరిదైన రెండో టెస్టు(డే/నైట్)లోనూ పాకిస్థాన్ చిత్తుచిత్తుగా ఓడింది. ఆతిథ్య ఆసీస్ ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారూలు 2-0తో కైవసం చేసుకున్నారు. టెస్టులో తన బ్యాటింగ్ నైపుణ్యంతో ఆద్యంతం అలరించిన స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 302 పరుగులు చేయగా..ఆస్ట్రేలియా 589 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.


ఫాలో ఆన్ ఆడిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్ ధాటికి 239 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ షాన్ మసూద్(68), అసద్ షఫిక్(57), మహ్మద్ రిజ్వాన్(45) మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్ దారుణ వైఫల్యంతో ఓటమిపాలైంది. లైయన్‌తో పాటు జోష్ హేజిల్‌వుడ్(3/ 63) విజృంభించడంతో పాక్ మరోసారి స్వల్ప స్కోరుకే చేతులెత్తేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్(335) అజేయ ట్రిపుల్ సెంచరీకి తోడు మార్నస్ లబుచానే(162) రాణించడంతో కేవలం 3 వికెట్లు మాత్రమే చేజార్చుకున్న ఆసీస్ అలవోకగా 600కు సమాన స్కోరును ప్రత్యర్థికి నిర్దేశింగలిగింది.



965
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles