ఏసియా పసిఫిక్ ఈత పోటీల్లో నరేందర్‌గౌడ్‌కు రజతం

Sun,September 9, 2018 07:44 AM

Narender goud won silver in Asia Pacific swimming competitions

హైదరాబాద్: మలేషియాలో జరుగుతున్న ఏసియా పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్‌లో బండి నరేందర్‌గౌడ్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఏసియా పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్ పెనాంగ్-2018 ఈత పోటీలు మలేషియాలో జరుగుతున్నాయి. 7 నుంచి 15 వరకు జరుగుతున్న ఈత పోటీల్లో శనివారం పీర్జాదిగూడ పురపాలక సంఘానికి చెందిన బండి నరేందర్‌గౌడ్ ద్వితీయ స్థానంలో నిలిచి రజతాన్ని అందుకున్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా మాస్టర్ గేమ్స్‌లో పాల్గొని రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు.

599
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles