2 పరుగులకే టీమ్ ఆలౌట్!

Fri,November 24, 2017 03:42 PM

Nagaland Team all out for just 2 in BCCI Under 19 Womens Tourney

గుంటూరు: మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఓ టీమ్ కేవలం రెండంటే రెండు పరుగులకే ఆలౌటైంది. బీసీసీఐ అండర్-19 వుమెన్స్ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగా నాగాలాండ్ టీమ్ సాధించిన ఘనత ఇది. కేరళతో జరిగిన మ్యాచ్‌లో నాగాలాండ్ ఈ చెత్త రికార్డును మూట గట్టుకుంది. ఈ రెండు పరుగులు కోసం ఆ టీమ్ ఏకంగా 17 ఓవర్లు ఆడటం ఇక్కడ మరో విశేషం. టీమ్‌లో 9 మంది డకౌట్ కాగా.. ఓపెనర్ మేనకా మాత్రమే ఒక్క పరుగు చేసింది. పదకొండో నంబర్ బ్యాట్స్‌వుమన్ ప్రియాంకా జీరోతో నాటౌట్‌గా నిలిచింది. గుంటూరులోని జేకేసీ కాలేజ్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ తొలి బంతికే విజయం సాధించింది. నాగాలాండ్ బౌలర్ దీపికా తొలి బంతి వైడ్ వేయగా.. తర్వాతి బంతిని ఫోర్ కొట్టింది కేరళ ఓపెనర్ అన్షు. లోధా కమిటీ సిఫారసుల ప్రకారం ఈ మధ్యే బీసీసీఐ తన టోర్నీల్లో ఈశాన్య రాష్ర్టాలను కూడా చేర్చింది. ఇంతకుముందు నాగాలాండ్, మణిపూర్ మ్యాచ్‌లో 136 వైడ్లు నమోదైన విషయం తెలిసిందే.

5202
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles