పోలెండ్ చిన్నారి మాట‌ల‌కి నాగార్జున ఫిదా

Sat,December 9, 2017 10:36 AM

nag impressed with ZBIGS song

పోలెండ్ చిన్నారి జిబిగ్జ్ యూట్యూబ్‌తో ఎక్కువ ట‌చ్‌లో ఉండేవారికి తెలిసే ఉంటుంది. తెలుగు అన్నా, తెలుగు పాట‌లు అన్నా, తెలుగు సినిమాల‌న్నా ఈ చిన్నారికి ప్రాణం. 8 ఏళ్ళ ఈ బుడ‌త‌డు అప్పుడ‌ప్పుడు తెలుగు పాట‌ల‌ని పాడ‌డం, డైలాగులు చెప్ప‌డం చేస్తుంటాడు. తాజాగా అఖిల్ లేటెస్ట్ మూవీ హ‌లో చిత్రంలోని మెరిసే మెరిసే అనే పాట పాడి త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాక త‌న పోస్ట్‌కి కామెంట్ కూడా పెట్టాడు. ‘‘హలో అఖిల్.. నా పేరు జిబిగ్జ్.. నాది పోలాండ్. మెరిసే మెరిసే పాటలో నీ పెరఫార్మెన్స్ ఎలక్ట్రిఫైయింగ్ గా ఉంది.. ఇక ఈ పాట, నీ డ్యాన్స్ అదిరిపోయింది. నేను ష్యూర్‌గా చెప్తున్నా.. నీ ఫిల్మ్ మంచి హిట్ సాధిస్తుంది. అఖిల్ నేను నిన్ను చాలా అభిమానిస్తున్నాను. హలో సినిమా గ్రేట్ సక్సెస్ కావాలని భావిస్తున్నాను. చీర్స్ అఖిల్’’ అంటూ ట్వీట్ చేశాడు. చిన్నారి పాట పాడిన విధానానికి ఇంప్రెస్ అయిన నాగ్ అద్భుతం అని జిజిగ్జ్ ట్వీట్‌కి కామెంట్ పెట్టాడు.
3258
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS