అలా చేస్తే కోచ్ నన్ను చంపేసేవాడు!

Fri,May 11, 2018 12:43 PM

My Coach would have killed me if I tampered the ball Says Australias new coach Justin Langer

సిడ్నీ: ఆస్ట్రేలియా టీమ్ కొత్త కోచ్ జస్టిస్ లాంగర్ బాల్ టాంపరింగ్‌పై స్పందించాడు. సౌతాఫ్రికా సిరీస్‌లో ఆసీస్ ప్లేయర్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ బాల్ టాంపరింగ్ చేయడాన్ని సమర్థించేలా లాంగర్ మాట్లాడటం విశేషం. నేనూ టీమ్‌లోకి వచ్చిన కొత్తలో సీనియర్ ప్లేయర్స్ టాంపరింగ్ చేయమని ఆదేశిస్తే చేసేవాడినే. ఎందుకంటే చేయలేనని సీనియర్లతో చెప్పే సాహసం చేయలేను. అయితే అప్పుడు కెప్టెన్‌గా ఉన్న అలన్ బోర్డర్ కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదు. ఇక కోచ్‌గా ఉన్న బాబ్ సింప్సన్ అయితే అలా చేస్తే నన్ను చంపేసేవాడు. అసలు క్రికెట్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా వాళ్లను సింప్సన్ చంపేస్తాడు అని లాంగర్ చెప్పాడు.

1993లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో లాంగర్ తన టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. అప్పుడు కెప్టెన్‌గా బోర్డర్, కోచ్‌గా బాబ్ సింప్సన్ ఉండేవాళ్లు. బాన్‌క్రాఫ్ట్ సొంతంగా టాంపరింగ్ నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేడని, అతన్ని కచ్చితంగా సీనియర్లు ప్రోత్సహిస్తేనే చేశాడని తాను నమ్ముతున్నట్లు లాంగర్ చెప్పాడు. టాంపరింగ్ చేసినందుకు బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు, దీనిని ప్రోత్సహించినందుకు స్మిత్, వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాను టీమ్‌లోకి వచ్చిన సమయంలో బోర్డర్, స్టీవ్ వా, డేవిడ్ బూన్, ఇయాన్ హీలీలాంటి క్రికెటర్లు ఉండేవాళ్లని, అలాంటి వాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నపుడు కచ్చితంగా మంచి క్రికెటర్‌గా ఎదిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని లాంగర్ అన్నాడు.

2973
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles