షాక్..ఐపీఎల్‌కు రెండేళ్ల పాటు దూరం

Sat,July 21, 2018 02:41 PM

Mustafizur Rahman Will Not be Allowed to Play in Foreign T20 Leagues

ఢాకా: బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ముస్తాఫిజుర్ వచ్చే రెండేళ్ల పాటు విదేశీ టీ20లీగుల్లో ఆడకుండా అనుమతి నిరాకరించినట్లు బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తెలిపారు.

ఫ్రాంఛైజీ లీగ్‌ల్లో ఆడుతున్నప్పుడు అతడు తరచూ గాయాలబారిన పడుతున్నాడు. జాతీయ జట్టుకు ఆడాల్సినప్పుడు అతడు జట్టుకు దూరమవుతున్నాడు. ఇది ఆమోదించదగిన విషయం కాదు. ఫ్రాంఛైజీ ఆధారిత టోర్నమెంట్లకు వచ్చే రెండేళ్ల పాటు అందుబాటులో ఉండకూడదని రెహ్మాన్‌కు ఇప్పటికే చెప్పాను. అని హసన్ తెలిపారు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ముస్తాఫిజుర్ వేలికి గాయం కావడంతో ఆ తరువాత బంగ్లాదేశ్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 22ఏళ్ల యువ పేసర్ బంగ్లాకు 10టెస్టులు, 27 వన్డేలు, 24టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు.

4701
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles