మురళీ విజయ్ సెంచరీ.. సీఏ ఎలెవన్‌తో మ్యాచ్ డ్రా

Sat,December 1, 2018 03:09 PM

Murali Vijay hits hundred as warm-up game ends in draw

సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఎలెవన్ టీమ్, టీమిండియా మధ్య జరిగిన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. వార్మప్ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఆశించిన మేర ప్రదర్శన చేయలేకపోయారు. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో దారుణ వైఫల్యం తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకంతో మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసేందుకు మురళీ విజయ్‌కు అవకాశం రాకపోగా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో విజయ్(129) సెంచరీతో చెలరేగాడు. నాలుగో రోజు, శనివారం ఆటలో భారత్ ఇన్నింగ్స్ 44వ ఓవర్లో విజయ్ ఔటవడంతో అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఎలెవన్ 544 పరుగుల భారీ స్కోరు సాధించిన విషయం తెలిసిందే.

అంతగా అనుభవంలేని ఆటగాళ్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. కీలక టెస్టు సిరీస్‌కు ముందు స్థానిక పరిస్థితులు, వికెట్‌ను అంచనావేసి బంతులు విసరడంలో టీమిండియా బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌కు మంచి ప్రాక్టీస్ లభించింది. ఐతే బౌలర్లు ఏమేరకు పుంజుకొని తొలి టెస్టులో సత్తా చాటుతారో చూడాలి. డిసెంబర్ 6న అడిలైడ్‌లో ఆసీస్‌తో కోహ్లీసేన తొలి టెస్టులో తలపడనుంది.

భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ 358:
సెకండ్ ఇన్నింగ్స్ 211/2(43.4 ఓవర్లు)

1936
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles