ఒకే ఓవర్లో 74 నుంచి 100 పరుగులకు.. వీడియో

Sun,December 2, 2018 12:06 PM

 Murali Vijay Goes From 74 To 100 In An Over

సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినప్పటికీ.. కసిమీదున్న విజయ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడి 91 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. తర్వాత రెచ్చిపోయి బ్యాటింగ్ చేసి కేవలం 27 బంతుల్లోనే రెండో అర్ధశతకం పూర్తి చేశాడు. జేక్ కార్డర్ వేసిన ఓవర్లో విజయ్ ఏకంగా 26 పరుగులు రాబట్టడం విశేషం. 38వ ఓవర్ ముగిసేసరికి 74 పరుగులతో ఉన్న మురళీ.. కార్డర్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 4, 4, 6, 2, 4 బాది శతకం పూర్తి చేశాడు. విజయ్ వరుసగా బాదిన బౌండరీల వీడియోకు నెటిజన్ల నుంచి స్పందన వస్తోంది.

భారత్, ఆసీస్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ అడిలైడ్‌లో గురువారం ఆరంభంకానుంది. నాలుగు రోజుల మ్యాచ్‌లో మురళీ విజయ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో ఆడించలేదు. ఫృథ్వీ షా గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బరిలో దిగాల్సి వచ్చింది.

4264
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles