ఆర్‌సీబీ నుంచి డికాక్‌ని కొనుగోలు చేసిన ముంబయి

Sat,October 20, 2018 03:41 PM

Mumbai Indians Start Early, Avail Services of Quinton de Kock from Royal Challengers Bangalore

ముంబయి: వచ్చే ఏడాది జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2019 కోసం ఆయా ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టులో కొనసాగుతున్న సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్‌ను ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ తాజాగా కొనుగోలు చేసింది. డిసెంబర్‌లో జరగనున్న ఐపీఎల్ ఆటగాళ్ల వేలానికి ముందే రెండు ఫ్రాంఛైజీలు పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. 2018 వేలంలో డికాక్‌ను రూ.2.8కోట్లు వెచ్చించి బెంగళూరు దక్కించుకుంది. ఇప్పుడే అదే ధరకు ముంబయి కొనుగోలు చేసింది. ఇప్పటికే ముంబయి టీమ్‌లో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్లు ఇషాన్ కిషన్, ఆదిత్య తారె ఉన్నారు. తాజాగా సీనియర్ వికెట్ కీపర్ డికాక్.. రోహిత్ సేనలో చేరడంతో టీమ్ మరింత బలం పెరిగింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు జట్టుకు గతేడాది సీజన్లో 8 మ్యాచ్‌లాడి కేవలం 201 పరుగులు మాత్రమే చేశాడు. నవంబర్ 15లోగా అట్టిపెట్టుకునే ఆటగాళ్లు, వేలంలోకి విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను ఫ్రాంఛైజీలు వెల్లడించాల్సి ఉంది.

1974
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles