ఫైనల్‌ వార్‌.. బ్యాటింగ్‌ ఎంచుకున్న రోహిత్‌ శర్మ

Sun,May 12, 2019 07:12 PM

Mumbai Indians have won the toss and have opted to bat

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-12వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య తుది సమరం ఆరంభమైంది. టైటిల్‌ పోరులో నెగ్గి నాలుగోసారి ట్రోఫీ సొంతం చేసుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ధోనీసేన కప్పు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది.

ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన ముంబై సారథి రోహిత్‌ శర్మ అనూహ్యంగా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఐతే తాను మాత్రం టాస్‌ గెలిస్తే బౌలింగ్‌ ఎంచుకునే వాడినని ధోనీ చెప్పడం విశేషం. రెండు జట్లు అన్ని రంగాల్లో బలంగా ఉండటంతో హైఓల్టేజ్‌ మ్యాచ్‌ రసవత్తరంగా సాగనుంది. ఇరుజట్లు తమతమ వ్యూహాలను అమలు చేసి ఎవరు పైచేయి సాధిస్తారో చూద్దాం.!

ముంబై జట్టు: రోహిత్‌ శర్మ, క్వింటన్‌ డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, కృనాల్‌ పాండ్య, హార్దిక్‌ పాండ్య, పొలార్డ్‌, రాహుల్‌ చాహర్‌, మెక్లనగన్‌, బుమ్రా, లసిత్‌ మలింగ

చెన్నై జట్టు: డుప్లెసిస్‌, షేన్‌ వాట్సన్‌, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోనీ, డ్వేన్‌ బ్రావో, రవీంద్ర జడేజా, హర్భజన్‌ సింగ్‌, దీపక్‌ చాహర్‌, శార్దుల్‌ ఠాకూర్‌, ఇమ్రాన్‌ తాహిర్‌1388
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles