ఎవరు గెలిచినా నాలుగోసారి టైటిల్ సొంతం..!

Sun,May 12, 2019 05:07 PM

Mumbai Indians Favourites Against Battle-hardened Chennai Super Kings

లీగ్‌లోనే అత్యంత విజయవంతమైన జట్లుగా గుర్తింపు పొందిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య నేడు హైదరాబాద్ వేదికగా తుదిపోరు జరుగనుంది. ఆడిన ప్రతీ సీజన్‌లోనూ టైటిల్ వేటలో ముందుంటున్న చెన్నై సింహాలు ఓవైపు.. పట్టుబడితే వదిలేది లేదంటూ దూసుకెళ్లే ముంబై పులులు మరోవైపు. ఒకటి నుంచి 9 వరకు అంతా హిట్టర్లతో దట్టంగా కనిపిస్తున్న రోహిత్ సేన, స్పిన్నర్లే ప్రధానాయుధంగా బరిలో దిగనున్న ధోనీ గ్యాంగ్. ఇప్పటికే చెరో మూడుసార్లు ట్రోఫీని ముద్దాడిన ఈ రెండు జట్లలో ఫెంటాస్టిక్ 4కొట్టేదెవరో.. భాగ్యనగరం సాక్షిగా మ‌రికొన్ని గంటల్లో తేలనుంది.

బుల్లెట్ ట్రైన్‌ను మించి వేగంగా..

చెన్నై బలం బలగం అంతా ధోనీనే. సాధారణ ఆటగాడి నుంచి అసాధారణ ప్రదర్శనను రాబట్టడంలో మహీకి సాటిలేరనేది నిర్వివాదాంశం. సరైన సమయంలో బౌలింగ్ మార్పు లు చేస్తూ.. బౌలర్ మనసెరిగి పీల్డింగ్ కూర్పులు చేస్తూ.. బ్యాట్‌పట్టి బరిలో దిగితే మెరుపులతో మైమరిపిస్తూ.. ఇలా ప్రతీ అంశంలోనూ ధోనీ ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతున్నాడు. బుల్లెట్ ట్రైన్‌ను మించి వేగంగా అతడు చేసే మెరుపు స్టంపింగ్‌ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గత మ్యాచ్‌లో ఓపెనర్లు వాట్సన్, డుప్లెసిస్ అర్ధసెంచరీలతో కదం తొక్కడం కలిసొచ్చే అంశమైతే మిడిలార్డర్‌లో ధోనీ, జడేజా టచ్‌లో ఉండటం సానుకూలాంశం. బౌలింగ్‌లో తాహిర్, హర్భజన్, జడేజాతో కూడిన స్పిన్ త్రయాన్ని ఎదుర్కోవడం ఎంతటి జట్టుకైనా కష్టసాధ్యమే. పవర్‌ప్లేలో దీపక్, డెత్ ఓవర్స్‌లో బ్రేవో ఎంత ప్రమాదకారులో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆడిన 10 సీజన్లలో 8 సార్లు ఫైనల్ చేరిందంటే ఈ డాడీస్ ఆర్మీ ఎంత బలమైందో అర్థం చేసుకోవచ్చు.

చెన్నై 3 సార్లు టైటిల్ ముద్దాడితే..

ఈ సీజన్‌లో తలపడ్డ మూడుసార్లు ముంబై చేతి లో ఓడటం చెన్నైని కలవరపెడుతోంది. అంతేకాదు పెద్ద మ్యాచ్‌ల్లో ముంబైతో పోల్చుకుంటే.. చెన్నై కాస్త వెనుకంజలో ఉందనే చెప్పుకోవాలి. లీగ్‌లో 8 సార్లు ఫైనల్ చేరిన చెన్నై 3 సార్లు టైటిల్ ముద్దాడితే.. 4 సార్లు ఫైనల్ చేరిన ముంబై మూడు సార్లు ట్రోఫీ ఎగరేసుకుపోయింది. బౌలింగ్‌లో పెద్దగా ఇబ్బందులు లేకున్నా.. బ్యాటింగ్‌లో నిలకడలేమే ప్రధాన సమస్యగా మారింది. ఇప్పటివరకు ధోనీ మినహా మరే ప్లేయర్ సీజన్‌లో తనదైన ముద్ర వేయలేకపోయాడు. రైనా, రాయుడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలేదు. కీలక మ్యాచ్‌లో బ్రేవో బ్యాట్‌తోనూ మెరవాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తున్నది. సొంతగడ్డపై క్వాలిఫయర్-1తో సహా రోహిత్ సేన చేతిలో మొత్తం మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ధోనీ బృందం ఈ ఒక్క మ్యాచ్‌లో నెగ్గి వాటన్నింటికీ బదులు తీర్చుకోవాలని భావిస్తున్నది.

పెద్ద మ్యాచ్‌ల్లో ఒత్తిడికి ఎదురొడ్డి నిలువగలగడం ముంబై ప్రధాన బలం. ఐపీఎల్ ఫైన ల్లో చెన్నైతో మూడు సార్లు తలపడితే.. అందులో రెండు సార్లు (2013, 2015) పైచే యి సాధించడం రోహిత్‌సేనకు అనుకూలాంశం. ఈ సీజన్‌లో నూ సూపర్‌కింగ్స్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబై దే పైచేయి అయింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో స్టార్లతో నిండిన ముంబై లైనప్ మొత్తం లీగ్‌లోనే అత్యుత్తమమనడంలో సందే హం లేదు. ఓపెనర్లు రోహిత్, డికాక్ మంచి ఆరంభాన్నిస్తే.. ఆ తర్వాత సూర్యకుమార్, ఇషాన్ కిషన్ మిడిల్ డల్‌కాకుండా చేసుకుంటున్నారు. ఇక కింది వరుసలో పాండ్యా బ్రదర్స్‌తో పాటు హార్డ్ హిట్టర్ పొలార్డ్ ఉండనే ఉన్నాడు. వీరంతా తలో చేయి వేస్తే ప్రత్యర్థికి కష్టాలు తప్పకపోవచ్చు. బౌలింగ్‌లో బుమ్రా తో పాటు మలింగ్ పేస్ భారాన్ని మోస్తుంటే.. గింగిరాలు తిరిగే బంతులతో రాహుల్ చహర్ ఆకట్టుకుంటున్నాడు. చెన్నైని చెన్నైలో ఓడించి నాలుగు రోజులుగా రెస్ట్ తీసుకుంటుండటంతో పాటు ఉప్పల్ వేదికగా జరిగిన 2017 ఐపీఎల్ ఫైనల్లో నెగ్గడం ముంబైకి కలిసొచ్చే అంశాలు.డాడీస్ ఆర్మీ..

వృద్ధసింహాలు ఇమ్రాన్ తాహిర్, హర్భజన్ సింగ్‌లను కాచుకోవడమే ముంబైకి ప్రధాన సమస్య. వారిద్దరిని సమర్థం గా ఎదుర్కోగలిగితే సగం మ్యా చ్ గెలిచినట్లే. నాకౌట్ మ్యాచ్ ల్లో ధోనీలాగే ఆలోచించే రోహిత్ ముందుండి జట్టును నడిపించాల్సిన అవసరముంది. సీజన్‌లో ముంబై చేతిలో మూడుసార్లు ఓడిన చెన్నై బదులు తీర్చుకునేందుకు మరింత బలంగా దూసుకొస్తుంది కాబట్టి అందుకు తగ్గట్లే ప్రణాళికలు రూపొందించుకోవాలి.

4 ఐపీఎల్ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి నలుగురు ఆటగాళ్లు చెన్నైకి చెందిన వారే కావడం విశేషం. రైనా (241 పరుగులు), మురళీ విజయ్ (181 పరుగులు), ధోనీ (178 పరుగులు), వాట్సన్ (156 పరుగులు) అత్యధిక పరుగులు చేసిన వారిలో ముందున్నారు

5 ఇప్పటికే నాలుగుసార్లు ఐపీఎల్ గెలిచిన జట్లలో భాగమైన రోహిత్, హర్భజన్, రాయుడుకు ఇది ఐదో టైటిల్ వేట

1891
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles