గుండెపోటుతో ఫీల్డ్‌లోనే క్రికెటర్ మృతి

Tue,December 25, 2018 04:42 PM

Mumbai Cricketer dies on field after suffering massive Heart Attack

ముంబై: క్రికెటర్లు ఫీల్డ్‌లోనే ప్రాణాలు వదిలిన ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. తాజాగా అలాంటిదే మరో విషాద సంఘటన ముంబైలో ఈ నెల 23న జరిగింది. వైభవ్ కేసర్కర్ అనే క్రికెటర్ హార్ట్ అటాక్‌తో ఫీల్డ్‌లోనే కుప్పకూలాడు. టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా మ్యాచ్ ఆడుతుండగానే కేసర్కర్ తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చినట్లు చెప్పాడు. ఆ వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినా.. అతను అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. వైభవ్ కేసర్కర్ వయసు కేవలం 24 ఏళ్లు మాత్రమే. నిజానికి తీవ్రమైన ఛాతీ నొప్పి బాధిస్తున్నా.. అతడు అలాగే బ్యాటింగ్ కొనసాగించాడు. నొప్పి తీవ్రం కావడంతో అతని టీమ్ మేట్స్ బలవంతంగా ఫీల్డ్ నుంచి బయటకు తీసుకొచ్చారు.

ఈ మ్యాచ్‌ను ఓ యూట్యూబ్ చానెల్ లైవ్ టెలికాస్ట్ కూడా చేసింది. కేసర్కర్ తన ఛాతీని పట్టుకొని భారంగా ఫీల్డ్ వదిలి వెళ్లడం అందులో కనిపించింది. గావోదేవి అనే టీమ్‌కు అతను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మంచి టాలెంట్ ఉన్న క్రికెటర్‌గా ముంబైలో అతనికి పేరుంది. అతని హఠాన్మరణం ముంబై క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. స్థానిక క్రికెట్ టోర్నీల్లో కేసర్కర్ వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వైభవ్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం.

5635
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles