వరల్డ్‌కప్‌లో షకీబ్ స‌రికొత్త రికార్డు

Mon,June 24, 2019 05:24 PM

Mujeeb Strikes, Dismisses Shakib for 51

సౌతాంప్టన్: బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్‌లో అసాధారణ స్థాయిలో చెలరేగుతున్న షకీబ్(476) ప్రస్తుతం టోర్నీ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. డేవిడ్ వార్నర్(447), జో రూట్(424), ఫించ్(396) జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. స్టార్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ బంగ్లాకు ఒంటిచేత్తో విజయాలు అందిస్తున్నాడు. మెగా టోర్నీలో పరుగుల వరద పారిస్తున్న షకీబ్ వరల్డ్‌కప్ చరిత్రలో వెయ్యి పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. బంగ్లాదేశ్ తరఫున ఈ ఫీట్ సాధించిన ఏకైక ఆటగాడు షకీబ్ కావడం విశేషం. దవ్లాత్ జద్రాన్ వేసిన 21వ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసి రికార్డు చేరుకున్నాడు. ఓవరాల్‌గా ఈ ల్యాండ్‌మార్క్ సాధించిన 19వ ఆటగాడు షకీబ్. అఫ్గాన్‌తో మ్యాచ్‌లోనూ చెలరేగిన షకీబ్(51) అర్ధశతకంతో మెరిశాడు. భారీ స్కోరు దిశగా సాగుతున్న షకీబ్ ముజీబ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.2127
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles