ధోనీ ర‌నౌట్‌.. అంపైర్ నిర్ణ‌యం స‌రైందేనా ?

Mon,May 13, 2019 11:48 AM

MS Dhonis dramatic run out causes stir on Twitter

హైద‌రాబాద్‌: ఆదివారం ఉప్ప‌ల్ స్టేడియంలో థ్రిల్లింగ్‌గా సాగిన ఐపీఎల్ ఫైన‌ల్లో.. ముంబై ఇండియ‌న్స్ విక్ట‌రీ కొట్టింది. అయితే చెన్నై కెప్టెన్ ధోనీ ర‌నౌట్ అయిన తీరు వివాదాస్ప‌ద‌మైంది. కేవ‌లం ఒక ర‌న్‌ తేడాతోనే చెన్నై ఓట‌మిపాలైంది. కానీ ధోనీ ఔటైన సంద‌ర్భం ఆ మ్యాచ్‌లో కీల‌కం. ఆ రనౌటే మ్యాచ్‌ను మార్చేసిన‌ట్లు క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు. వాట్సాన్ కొట్టిన షాట్‌కు మొద‌ట ఒక ప‌రుగు తీశారు, అయితే ఓవ‌ర్‌త్రో కావ‌డంతో రెండో ర‌న్‌ కోసం ధోనీ ప‌రుగు తీశాడు. అప్పుడు మిడాఫ్‌లో ఉన్న ఇశాన్ కిష‌న్ వేసిన త్రో నేరుగా వికెట్స్‌ను త‌గిలింది. ఫీల్డ్ అంపైర్ ర‌నౌట్‌పై థార్డ్ అంపైర్‌కు సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇక టీవీ స్క్రీన్ల‌పై రిప్లేలు మొద‌ల‌య్యాయి. మూడ‌వ అంపైర్ నీగ‌ల్ లాంగ్ ర‌నౌట్‌పై నిర్ణ‌యం తీసుకునేందుకు చాలా స‌మ‌య‌మే తీసుకున్నాడు. చాలా కోణాల్లో ఆ ర‌నౌట్‌ను ప‌రిశీలించాల్సి వ‌చ్చింది. మ‌రో వైపు టీవీ కామెంటేట‌ర్లు త‌మ అనుభ‌వాల‌ను చెబుతూ మ్యాచ్‌పై ఆస‌క్తిని పెంచే ప్ర‌య‌త్నం చేశారు. కామెంటేట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ ఒక కోణంలో రిప్లేను చూసి ధోనీని ఔట్ ఇవ్వాల్సిందే అన్నాడు. మ‌రికొంత మంది కామెంటేట‌ర్లు మాత్రం.. బ్యామ్స్‌మెన్‌కు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలంటూ అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ చివ‌ర‌కు థార్డ్ అంపైర్‌.. ధోనీని ఔట్‌గా డిక్లేర్ చేశాడు. దీంతో ముంబై సంబ‌రాల్లో తేలింది. ఈ సంఘ‌ట‌న 13వ‌ ఓవ‌ర్‌లో చోటుచేసుకున్న‌ది. ఇక నెటిజ‌న్లు మాత్రం వెరైటీ ట్వీట్ల‌తో చెల‌రేగిపోతున్నారు.









9006
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles