ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా హగ్ చేసుకోవాలని ఉందంటూ..వీడియో

Mon,April 16, 2018 04:27 PM

MS Dhoni's Daughter Ziva Wants 'Daddy's Hug' During IPL Matchమొహాలి: ఐపీఎల్-11లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పోరాడి ఓడిన విషయం తెలిసిందే. చెన్నై సారథి మహేంద్రసింగ్ ధోనీ(79 నాటౌట్‌; 44 బంతుల్లో 6×4, 5×6) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆకట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఆఖర్లో విజృంభించిన మహీ చెన్నై అభిమానులకు గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ధాటిగా ఆడటంతో ధోనీ ఆలస్యం చేయడంతో చివర్లో సాధించాల్సి రన్‌రేట్ పెరిగిపోవడమే చెన్నై ఓటమికి కారణం. ధోనీ మెరిసినా చెన్నై 5 వికెట్లకు 193 పరుగులే చేయగలిగింది. మ్యాచ్ అనంతరం ధోనీ తన కూతురికి సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.

ఐతే ఓవైపు ధోనీ తన ట్రేడ్ మార్క్ షాట్లతో చెలరేగుతుంటే తన ముద్దుల కూతురు జీవా ధోనీ కూడా మహీ బ్యాటింగ్‌ను ఆస్వాదించింది. తన తల్లి సాక్షి దగ్గర గ్యాలరీలో కూర్చొన్న జీవా మ్యాచ్ మధ్యలో తన తండ్రి ధోనీని హగ్ చేసుకోవాలని కోరుకుంది. మీ నాన్న దగ్గరికి వెళ్తే ఏం చేస్తావ్? అని పక్కనున్నవారి అడగ్గా.. హగ్ చేసుకుంటానని తన ముద్దు ముద్దు మాటలతో జవాబిచ్చింది. ఎలా హగ్ చేసుకుంటావ్ అని సాక్షి అడగడంతో జీవా అందుకు తగ్గట్లుగా చేసి చూపించింది. మైదానంలో ధోనీ ఎక్కడున్న విషయాన్ని కూడా చేతితో చూపించి గ్యాలరీలో సందడి చేసింది. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా మహీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

When Ziva wanted to give a hug to papa during the match

A post shared by M S Dhoni (@mahi7781) on

3398
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles