వరల్డ్‌కప్ వరకు ధోనీ స్థానం పక్కా!

Sun,December 24, 2017 12:48 PM

MS Dhoni will play 2019 World Cup says Chief Selector MSK Prasad

ముంబైః టీమిండియా సెలక్షన్ కమిటీ చీఫ్ ఎమ్మెస్కే ప్రసాద్ ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. 2019 వరల్డ్‌కప్ వరకూ ధోనీ కొనసాగుతాడని అతడు స్పష్టంచేశాడు. కొంతమంది యువ వికెట్ కీపర్లను పరీక్షించినా వాళ్లు ధోనీకి దరిదాపుల్లో కూడా లేరని ఎమ్మెస్కే చెప్పాడు. దీంతో వన్డేల్లో స్థానం ఆశిస్తున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆశలు గల్లంతయ్యాయి. రెండో వికెట్ కీపర్ స్థానాన్ని దినేష్‌ కార్తీక్ ఆక్రమించేశాడు. సిరీస్ సిరీస్‌కు ధోనీ ప్రదర్శనను అంచనా వేస్తారా అని ప్రశ్నించగా.. ఎమ్మెస్కే ఈ విషయాన్ని స్పష్టంచేశాడు. ఇండియా ఎ టూర్లలో కొందరు యువ వికెట్ కీపర్లను పరీక్షిస్తున్నాం. కానీ వరల్డ్‌కప్ వరకూ ధోనీకే ఫిక్సయ్యాం. ఆ తర్వాతే మిగతా వారిపై దృష్టిసారిస్తాం అని ఎమ్మెస్కే ప్రసాద్ తేల్చి చెప్పాడు. ఇప్పటికీ ప్రపంచంలో బెస్ట్ వికెట్ కీపర్ ధోనీయే. మేం ఈ విషయాన్ని పదే పదే చెబుతూనే ఉన్నాం. ప్రస్తుతం శ్రీలంకతో టీ20 సిరీస్‌లో అతడు చేసిన స్టంపింగ్స్, అందుకున్న క్యాచ్‌లు అద్భుతం అని ప్రసాద్ అన్నాడు. ఇండియాలోనే కాదు ప్రపంచ క్రికెట్‌లో ధోనీకి దరిదాపుల్లో ఉన్న వికెట్ కీపర్ లేడని అతను చెప్పడం విశేషం. ఆ తర్వాత మరో మాటతో పంత్, సంజు శాంసన్‌లాంటి యువ క్రికెటర్ల ఆశలను తుంచేశాడు ఎమ్మెస్కే. నిజం చెప్పాలంటే ఆ యువ వికెట్ కీపర్లు మా అంచనాలకు చాలా దూరంలో ఉన్నారు. వాళ్లకు ఇండియా ఎ టూర్లలో అవకాశాలు ఇచ్చి రాటుదేలేలా ప్రయత్రం చేస్తాం అని ప్రసాద్ తెలిపాడు.

3150
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles