మరో అరుదైన రికార్డు చేరువలో మహేంద్రుడు

Wed,July 11, 2018 06:53 PM

MS Dhoni Set To Join Tendulkar, Ganguly, Dravid In This Elite Club

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో అరుదైన రికార్డుల జాబితాలో చోటు దక్కించుకోనున్నాడు. అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో ధోనీ 10వేల పరుగుల మార్క్‌ను చేరుకునేందుకు ఇంకా 33 పరుగులు చేయాల్సి ఉంది. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో మహీ ఇన్‌క్రెడిబుల్ ఫీట్‌ను చేరుకునే గొప్ప అవకాశం వచ్చింది. తొలి వన్డే ఈనెల 12న ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఆరంభంకానుంది. ధోనీ 33 పరుగులు చేస్తే.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరభ్ గంగూలీ తర్వాత 10వేల పరుగుల క్లబ్‌లో చేరిన నాలుగో భారత ఆటగాడిగా నిలవనున్నాడు. ప్రపంచ క్రికెట్లో మొత్తంగా ఈ క్లబ్‌లో చేరిన 12వ క్రికెటర్‌గా ధోనీ ఈ ఘనత సాధించనున్నాడు.

ప్రస్తుతం దిగ్గజ క్రికెటర్ సచిన్ వన్డేల్లో 18,426 పరుగులతో ఎవరికీ అందనంత దూరంలో ఉన్నాడు. శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర(14,234), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(13,704), శ్రీలంక ఆటగాళ్లు సనత్ జయసూర్య(13,430), మహేల జయవర్దనే(12,650), పాకిస్థాన్ మాజీ సారథి ఇంజమామ్ హుల్ హక్(11,739), సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కలీస్(11,579), గంగూలీ(11,363), ద్రావిడ్(10,889), బ్రియన్ లారా(10405), శ్రీలంక ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్(10,290) ఈ జాబితాలో ఉన్నారు. సంగక్కర తరువాత ఈ 10వేల మార్క్‌ను అందుకున్న రెండో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ధోనీ అరుదైన జాబితాలో చేరిపోనున్నాడు.

వన్డేల్లో నాలుగోవాడు..

వన్డేల్లో ఇప్పటి వరకు ధోనీ అందుకున్న క్యాచ్‌లు 297. ఓవరాల్‌గా అత్యధిక క్యాచ్‌లు అందుకున్న జాబితాలో నాలుగో వికెట్ కీపర్. ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిష్ట్ 417, సౌతాఫ్రికా కీపర్ మార్క్ బౌచర్ 402, సంగక్కర 383 తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

4572
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles