సరదాగా చేశా.. మీరూ ప్రయత్నించండి: ధోనీ

Wed,August 1, 2018 12:00 PM

MS Dhoni having fun with a cycle and headphones

న్యూఢిల్లీ: ఇటీవల ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ముగిశాక భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్వదేశానికి తిరిగొచ్చాడు. క్రికెట్ ఆట నుంచి విరామం లభించడంతో ధోనీ సరదాగా కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం తన భార్య సాక్షి స్నేహితురాలి వివాహానికి కూడా మహీ హాజరైన విషయం తెలిసిందే. తాజాగా తన సువిశాలమైన ఇంటి ప్రాంగణంలో ఒక సైకిల్ స్టంట్ చేస్తుండగా తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. సరదా కోసం.. మీ ఇంట్లో మీరు కూడా ప్రయత్నించండి. అంటూ తన పోస్ట్‌లో వ్యాఖ్యానించాడు.

ఒక చిన్న సైకిల్ మీద కూర్చొన్న ధోనీ ఒక హెడ్‌సెట్ ధరించి నోట్లో పొడ‌వైన క‌ర్ర‌ను పెట్టుకొని ఎత్తైన ప్రాంతం నుంచి కిందకి వెళ్తుండటం ఆ వీడియోలో కనిపించింది. ఐతే ఇది ఫొటోషూట్ కోసం చేశాడా? లేక సరదా కోసం చేసిందా మాత్రం తెలపలేదు. మీరు కూడా ఇలా ప్రయత్నించండని అభిమానులను కోరడంతో అభిమానులు ధోనీలా చేసేందుకు నానాతంటాలు పడుతున్నారు.

Just for fun, plz try it at home.

A post shared by M S Dhoni (@mahi7781) on

1342
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS