ధోనీ @ 10,000 వాలా!

Sat,January 12, 2019 06:28 PM

MS Dhoni becomes fifth batsman to breach 10,000-run  mark in ODIs for India

సిడ్నీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ మరో రికార్డు నమోదు చేశాడు. వన్డేల్లో 10,000 పరుగుల క్లబ్‌లో మహీ చేరాడు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో సింగిల్ తీయడం ద్వారా ఈ 10వేల మార్క్‌ను అందుకున్నాడు. భారత్ తరఫున ఈ ఫీట్ అందుకున్న ఐదో బ్యాట్స్‌మన్ ధోనీనే. మహీ కన్నా ముందు భారత క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ ఈ క్లబ్‌లో ఉన్నారు. ఓవరాల్‌గా వన్డే క్రికెట్ చరిత్రలో ఈ ఫీట్ అందుకున్న 12వ ఆటగాడిగా కెప్టెన్ కూల్ ధోనీ నిలిచాడు.

శ్రీలంక క్రికెటర్ సంగక్కర తర్వాత ఈ ఘనత సాధించిన రెండో వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా ధోనీ నిలిచాడు. వన్డేల్లో ఇప్పటి వరకు 333 మ్యాచ్‌లాడిన ధోనీ 10,224 పరుగులు సాధించగా.. అందులో 10శతకాలు, 68 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 183. గ‌తేడాది తిరువనంతపురం వేదికగా విండీస్‌తో ఐదో వన్డేకి ముందు ధోని 10 వేల పరుగుల మార్కును చేరుకునేందుకు ఒక్క పరుగు దూరంలో నిలిచిన విష‌యం తెలిసిందే.

4032
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles