ట్రాక్టర్ నడిపిన ధోనీ.. లీడర్‌కి ఘ‌న‌ స్వాగ‌తం!

Sun,August 5, 2018 10:07 AM

MS Dhoni appears for TNPL toss, makes a big promise to CSK fans

చెన్నై: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తమిళనాడులోని తిరునెల్వేలిలో సందడి చేశారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లో భాగంగా జరిగిన మ్యాచ్‌ను వీక్షించేందుకు మహీ ఇక్కడకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సందర్భంగా ఇక్కడ పర్యటించి అభిమానులను అలరించారు. తన పర్యటనలో ధోనీ ట్రాక్టర్‌ను కూడా నడపడం విశేషం. ధోనీ రాకతో నిర్వాహకులు ఘనస్వాగతానికి ఏర్పాట్లు చేశారు. మైదాన‌మంతా తిరిగి అభిమానుల‌కు అభివాదం చేశాడు.

టీఎన్‌పీఎల్‌లో భాగంగా తిరునెల్వేలిలో మధురై పాంథర్స్, కోవై కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ముందు నిర్వహించిన టాస్ సమయంలోనూ ధోనీ మైదానంలోనే ఉన్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ అకస్మాత్తుగా స్డేడియంలో ప్రత్యక్షమవడంతో అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఈ సందర్భంగా కెప్టెన్ కూల్ మాట్లాడుతూ వచ్చే ఐపీఎల్ సీజన్‌లోగా తమిళం మాట్లాడటం నేర్చుకుంటానని ఫ్యాన్స్‌కు చెప్పాడు. ప్రతి ఏడాది టీఎన్‌పీఎల్‌లో జరిగే కొన్ని మ్యాచ్‌లను వీక్షించేందుకు తప్పకుండా వస్తానని వివరించారు. ఈ ఏడాది టోర్నీలో నేను చూసిన తొలి గేమ్ ఇదేనని వెల్లడించారు. సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియాకప్‌లో ధోనీ మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకొని అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్నాడు.

1552
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS