ధోనీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

Mon,April 22, 2019 12:24 PM

MS Dhoni 1st Indian to hit 200 sixes in Indian Premier League

బెంగ‌ళూరు: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో 200 సిక్స‌ర్లు బాదిన ఏకైక భార‌త‌ క్రికెట‌ర్‌గా ధోనీ నిలిచాడు. టీ20 కెరీర్‌లోనే అత్య‌ధిక స్కోరు న‌మోదు చేసిన ధోనీ 84(48 బంతుల్లో) ప‌రుగులు చేసిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో మ్యాచ్‌లో ఈ మైలురాయి అందుకున్నాడు. ఆఖ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన పోరులో ఒక్క పరుగు తేడాతో చెన్నైపై బెంగళూరు విజయం సాధించింది. ఐపీఎల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 184 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 4330 ప‌రుగులు చేశాడు. అత్య‌ధిక స్కోరు 84 కావ‌డం విశేషం.ప్ర‌స్తుతం ధోనీ ఖాతాలో 292 ఫోర్లు.. 203 సిక్స‌ర్లు ఉన్నాయి. బెంగ‌ళూరుతో మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదిరిపోయే ప్ర‌ద‌ర్శ‌న చేసిన చెన్నై సార‌థి మ‌హేంద్ర‌సింగ్ ధోనీ (48 బంతుల్లో 84; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) పోరాటం వృథా అయింది.
3575
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles