మిస్ట‌ర్ డిపెండ‌బుల్‌.. అప్పుడైనా.. ఇప్పుడైనాWed,January 11, 2017 01:37 PM
మిస్ట‌ర్ డిపెండ‌బుల్‌.. అప్పుడైనా.. ఇప్పుడైనా

న్యూఢిల్లీ: నిజ‌మే రాహుల్ ద్ర‌విడ్ తాను టీమిండియాకు ఆడుతున్న స‌మ‌యంలో అయినా.. ఇప్పుడైనా మిస్ట‌ర్ డిపెండ‌బులే. టీమ్ కోసం ఆడ‌ట‌మంటే ఏంటో ఎవ‌రైనా ద్ర‌విడ్‌ని చూసే తెలుసుకోవాలి. ఒక‌ద‌శ‌లో టీమ్ కోసం వికెట్ కీపింగ్‌, కెప్టెన్సీ, బ్యాటింగ్.. ఇలా అన్ని భారాలు మోసిన‌వాడు ద్ర‌విడ్. మిస్ట‌ర్ డిపెండ‌బుల్ పేరును నిజంగా సార్ధ‌కం చేసుకున్న‌వాడు. వికెట్ల‌కు అడ్డుగోడ‌లా నిల‌బ‌డి ద వాల్ అన్న ముద్దుపేరునూ సంపాదించుకున్నాడు. అప్పుడు టీమ్ భారాన్ని మోసిన రాహుల్‌.. ఇప్పుడు ఇండియా ఎ, అండ‌ర్ 19 టీమ్ కోచ్‌గా టీమిండియాకు నాణ్య‌మైన ప్లేయ‌ర్స్ అందించే భారాన్ని కూడా మోస్తున్నాడు. ఇవాళ త‌న 44వ పుట్టిన‌రోజును జ‌రుపుకుంటున్నాడత‌డు. ఈ సంద‌ర్భంగా టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మ‌న్ వీరేంద్ర సెహ్వాగ్‌.. ద్ర‌విడ్‌కు త‌న‌దైన స్టైల్లో బ‌ర్త్ డే విషెస్ చెప్పాడు.


ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో 24,208 ప‌రుగులు.. క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆరో బ్యాట్స్‌మ‌న్‌గా రికార్డు. వ‌న్డేల్లో 83 హాఫ్ సెంచ‌రీలు. ఈ ఫార్మాట్‌లో అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు చేసిన‌వారిలో నాలుగోస్థానం. ఇదీ బ్యాట్స్‌మ‌న్‌గా ద్ర‌విడ్ రికార్డు. అందుకే క్రికెట్ నుంచి రిటైరై ఇన్నేళ్ల‌యినా.. ఐసీసీ కూడా అత‌ని బ‌ర్త్‌డేకు స్పెష‌ల్ విషెస్ చెప్పింది.
టీమిండియాకు 16 ఏళ్ల పాటు సేవలందించిన రాహుల్ ద్రవిడ్.. 2012లో రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల్లో 13288 రన్స్ చేశాడు. అందులో 36 సెంచరీలు ఉన్నాయి. 2003 నుంచి 2007 వరకు టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టాడు. అయితే 2007 వరల్డ్ కప్ తొలి రౌండ్లోనే టీమ్ ఇంటిదారి పట్టడంతో ఆ తర్వాత కెప్టెన్సీకి రాజీనామా చేసి ప్లేయర్ గా కొనసాగాడు. రిటైరైన తర్వాత టీమిండియా కోచ్ పదవితోపాటు కొన్ని కీలక బాధ్యతలు ఇవ్వడానికి బీసీసీఐ సిద్ధంగా ఉన్నా ద్రవిడ్ వాటిని స్వీకరించలేదు. ఇండియా ఎ టీమ్ కోచ్ గానే కొనసాగుతూ.. టీమిండియాకు మంచి ప్లేయర్స్ ను అందించే పనిలో ఉన్నాడతడు.

1299
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS