మోర్గాన్ సిక్సర్ల వర్షం..57 బంతుల్లో మెరుపు సెంచరీ

Tue,June 18, 2019 06:02 PM

Morgan Dealing in Sixes and Fours

మాంచెస్టర్: ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. అఫ్గనిస్థాన్ బౌలర్లను లక్ష్యంగా చేసుకొని అలవోకగా భారీ సిక్సర్లు కొట్టేస్తున్నాడు. వన్డే కెరీర్‌లో మోర్గాన్ 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాట్స్‌మన్ మోర్గాన్ కావడం విశేషం. బౌండరీలు బాదడమే లక్ష్యంగా మైదానం నలువైపులా పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. మోర్గాన్ జోరుకు అఫ్గాన్ బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు.

రషీద్ ఖాన్ వేసిన 43వ ఓవర్లో ఏకంగా మూడు ఫోర్లు బాది కేవలం 57 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో ఇప్పటికే 11సిక్సర్లు, 3ఫోర్లు బాదాడు. వన్డేల్లో మోర్గాన్‌కిది 13వ సెంచరీ కావడం విశేషం. వన్డేల్లో ఇంగ్లాండ్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా ఘనత సాధించాడు. మరో ఎండ్‌లో రూట్ సైతం జోరు పెంచాడు. మూడో వికెట్ ఈ జోడీ 100కు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. 45 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ రెండు వికెట్లకు 323 పరుగులు చేసింది. మోర్గాన్(118), రూట్(83) క్రీజులో ఉన్నారు.

2485
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles