ప్రారంభ‌మైన మోంట్‌ఫోర్ట్ స్కూల్ గేమ్స్‌

Wed,November 21, 2018 01:33 PM

Montfort school games begins at Uppals Little Flower School

ఉప్పల్: ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో ఇవాళ 34వ మోంట్‌ఫోర్టు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. ఆరు రాష్ర్టాల్లోని 29 పాఠశాలలకు చెందిన 1500 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి రెవరెండ్ బ్రదర్ జాన్ కలరాకల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆయన అన్నారు. క్రీడా నియమావళిపై అవగాహన కూడా పొందాలని బ్రదర్ కలరాకల్ తెలిపారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందన్నారు. వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు కవాతు ప్రదర్శనతో పాటు మాక్‌డ్రిల్‌ను చేపట్టారు. బ్రదర్ విన్సెంట్ రెడ్డి, స్కూల్ ప్రిన్సిపల్ హృదయ్‌కుమార్ రెడ్డి, రెవరెంట్ బ్రదర్ ఫ్రాంకీ ఆరోనా, కేఎం జోసెఫ్‌లు, మాజీ కబడ్డీ ప్లేయర్ సోమేశ్వర్ రెడ్డి, మాజీ వాలీబాల్ ప్లేయర్ రవీందర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు మోంట్‌ఫోర్ట్ గేమ్స్ జరగనున్నాయి.

1885
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles