షమిని కలిసిన ఆ పాకిస్థాన్ యువతి ఏం చెప్పింది?

Mon,March 19, 2018 05:44 PM

Mohammed Shamis Pakistan friend finally speaks about their relationship

ఇస్లామాబాద్‌ః టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమిపై అతని భార్య హసీన్ జహాన్ చేసిన ఆరోపణల్లో ప్రధానమైనది మ్యాచ్ ఫిక్సింగ్. ఈ ఆరోపణలు చేస్తూ అతను సౌతాఫ్రికా టూర్ నుంచి వస్తూ దుబాయ్‌లో ఓ పాకిస్థాన్ యువతిని కలిశాడని, మొహమ్మద్ భాయ్ అనే వ్యక్తి సూచన మేరకు ఆమె నుంచి డబ్బు తీసుకున్నాడని హసీన్ ఆరోపించింది. ఆమె ఆరోపణల మేరకు బీసీసీఐ ఇప్పటికు షమిపై మ్యాచ్ ఫిక్సింగ్ కోణంలో దర్యాప్తు కూడా జరుపుతున్నది. పాకిస్థాన్‌కు చెందిన ఆ యువతి పేరు అలిష్బా. మొత్తానికి ఈ ఆరోపణలపై ఆమె నోరు విప్పింది. గతేడాది చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఇండియా ఓడిపోయిన తర్వాత తమకు పరిచయం ఏర్పడినట్లు అలిష్బా చెప్పింది. ఆ మ్యాచ్‌లో ఓ పాక్ అభిమాని షమితో దురుసుగా ప్రవర్తించాడు. ఈ వార్త బాగా హైలైట్ కావడంతో అలిష్బా.. షమి గురించి తెలుసుకుంది. అతన్ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యాను. ఆ తర్వాత స్నేహితులుగా మారాం. నేను అతనికి మెసేజ్‌లు కూడా పంపిస్తాను. కానీ అతనికున్న లక్షలాది అభిమానుల్లో నేను కూడా ఓ సాధారణ అభిమానిని మాత్రమే. వ్యక్తిగతంగా షమి అంటే నాకు చాలా ఇష్టం. అతన్ని నేరుగా కలవాలని కలలుగన్నాను అని అలిష్బా చెప్పింది.

3182
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS