'కుంబ్లే' 12ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన షమీ

Mon,December 17, 2018 02:55 PM

Mohammed Shami takes 6 wickets, breaks Anil Kumble�s 12 year old record

పెర్త్: ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో టీమ్ ఇండియా స్పీడ్‌స్టర్ మహ్మద్ షమీ రికార్డు ప్రదర్శన చేశాడు. ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్లందరిని షమీ ఔట్ చేశాడు. ఒక్క రెండో ఇన్నింగ్స్‌లోనే 6 వికెట్లతో చెలరేగాడు. టెస్టు క్రికెట్ కెరీర్‌లో (6/56) అతనికిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. నాలుగో రోజు ఆటలో ఆసీస్ ఆటగాడు నాథన్ లైయన్‌ను ఔట్ చేయడం ద్వారా ఒక కేలండర్ ఇయర్‌లో విదేశాల్లో జరిగిన టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

2018లో ఐదేసి వికెట్లు తీయడం పేసర్‌కు ఇది రెండోసారి. జనవరిలో సౌతాఫ్రికాతో జోహాన్నెస్ టెస్టులో షమీ(5/28) మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు 10 టెస్టులాడిన షమీ 27.07 సగటుతో 42 వికెట్లు పడగొట్టాడు. ఓవర్సీస్ టూర్లలో 2006లో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే(41 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును షమీ తాజాగా అధిగమించాడు. వీరిద్దరు మినహా మరో భారత బౌలర్ ఒక కేలండర్ ఇయర్‌లో విదేశాల్లో 40కిపైగా వికెట్లు తీయలేదు.

3213
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles