ష‌మీ 15 ఓవర్లు మాత్రమే వేయాలి.. ప్ర‌తిరోజు రిపోర్ట్ పంపండి!

Sat,November 17, 2018 06:29 PM

Mohammed Shami allowed to bowl only 15 overs per innings for Bengal

న్యూఢిల్లీ: టీమిండియా సీనియ‌ర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ వేసే ఓవ‌ర్ల సంఖ్య‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప‌రిమితిని విధించింది. రంజీ ట్రోఫీలో బంగాల్ తరఫున ష‌మీ ఆడుతున్న విష‌యం తెలిసిందే. కేరళ టీమ్‌తో ఆ జట్టు మంగళవారం నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీని ఇన్నింగ్స్‌కు 15 ఓవర్లకి మించి బౌలింగ్ చేయించరాదని బంగాల్ జ‌ట్టును బీసీసీఐ ఆదేశించింది. దీంతో మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి షమీ మొత్తం 30 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం ఉంది. రంజీ ట్రోఫీలో భాగంగా ఆడే మ్యాచ్‌లో ప్ర‌తిరోజు ఆట ముగిసిన‌ త‌ర్వాత అత‌డి ఫిట్‌నెస్‌, వ‌ర్క్‌లోడ్‌కు సంబంధించిన రిపోర్ట్‌ను బోర్డు ఫిజియోకు పంపించాల‌ని బంగాల్ టీమ్ మేనేజ్‌మెంట్‌ను బీసీసీఐ ఆదేశించింది.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భార‌త జ‌ట్టులో ష‌మీకి చోటు ద‌క్కిన విష‌యం తెలిసిందే. ఐతే కీల‌క సిరీస్ ముంగిట‌ అత‌డిపై ప‌ని ఒత్తిడి ఎక్కువ‌గా ప‌డ‌కుండా ఉండేందుకు బీసీసీఐ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో అత‌డు వేసే ఓవ‌ర్ల సంఖ్య‌పై ప‌రిమితిని విధించింది. డిసెంబరు 6 నుంచి భారత్ జట్టు ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది.

3481
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles