కోహ్లి అన్నదాంట్లో తప్పేముంది..?

Fri,November 9, 2018 02:21 PM

Mohammed Kaif backs Virat Kohli over his Leave India comments

న్యూఢిల్లీ: ఓ అభిమానిని దేశం వదిలి వెళ్లిపో అని కోహ్లి అనడంపై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ట్విటర్ సీరియస్‌గా స్పందించింది. కామెంటేటర్ హర్షాభోగ్లేలాంటి వాళ్లు కూడా కోహ్లి తీరును తప్పుబట్టారు. అయితే మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మాత్రం విరాట్‌కు అండగా నిలిచాడు. అసలు అతడు అన్నదాంట్లో తప్పేముందని ప్రశ్నించాడు. ఎవరి ఎజెండా ప్రకారం వాళ్లు ప్రకటనలను ఎలా మార్చుకుంటారో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. గతంలో కోహ్లి కూడా విదేశీ క్రీడాకారులను మెచ్చుకున్నాడు. అతడు పూర్తిగా వేరే ఉద్దేశంతో ఈ కామెంట్ చేశాడు. కానీ కొంతమంది అతన్ని కావాలని లక్ష్యంగా చేసుకుంటున్నారు అని కైఫ్ ట్వీట్ చేశాడు.


ఈ మధ్య కోహ్లి తన వ్యక్తిగత యాప్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఓ అభిమాని మాట్లాడుతూ కోహ్లిని ఎక్కువ చేసి చూపించారని, అతని బ్యాటింగ్ కంటే తనకు ఇంగ్లిష్, ఆస్ట్రేలియా క్రికెటర్ల బ్యాటింగే నచ్చుతుందని అన్నాడు. దీనిపై కోహ్లి స్పందిస్తూ అలా అయితే నువ్వు దేశం వదిలి వెళ్లిపో అని సదరు అభిమానికి ఘాటుగా రిైప్లె ఇచ్చాడు. ఈ విషయంలో కొంతమంది కోహ్లికి మద్దతు తెలపగా.. ఎక్కువ మంది అతనిపై విమర్శలు గుప్పించారు.

2351
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS