భారత్‌పై అఫ్గాన్ ఓపెనర్ సూపర్ సెంచరీ

Tue,September 25, 2018 07:07 PM

Mohammad Shahzad leads Afghanistan with quick hundred

అబుదాబి: ఆసియాకప్ సూపర్-4లో భాగంగా టీమ్‌ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ ఓపెనర్ మహ్మద్ షెజాద్(103 నాటౌట్: 88 బంతుల్లో 10ఫోర్లు, 6సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. క్రీజులో అడుగుపెట్టింది మొదలు మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. పవర్ ప్లేలో టీ20 క్రికెట్ తరహాలో కళ్లుచెదిరే షాట్లు ఆడాడు. మధ్యలో వరుసగా వికెట్లు కోల్పోయినా ఏమాత్రం ఆందోళన చెందకుండా శతకాన్ని పూర్తి చేశాడు. భారత్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. మైదానం నలువైపులా ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసమే సృష్టించాడు. జట్టు మొత్తం స్కోరులో 90 శాతం పరుగులు అతనివే కావడం విశేషం.

రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన ఆటగాళ్లతో భారత జట్టు ఇవాళ బరిలోకి దిగింది. వన్డేల్లోకి అరంగేట్రం చేసిన దీపక్ చాహర్ తన తొలి రెండు ఓవర్లలో 24 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ వ్యూహాలను చిత్తుచేస్తూ ఒంటిచేత్తో పరుగులు రాబడుతున్నాడు. ప్రస్తుతం 29 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.

కెరీర్‌లో ఐదో శతకం

ఇప్పటి వరకు చిన్న జట్లు కెనడా, నెదర్లాండ్స్, జింబాబ్వే, స్కాట్లాండ్‌లపై తన పోరాటాన్ని ప్రదర్శించిన షెజాద్ ఇవాళ అగ్రశ్రేణి జట్టు భారత్‌పై మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో అతడు తన క్రికెట్ కెరీర్‌లో చిరస్మరణీయ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

5219
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS