రిటైర్మెంట్ ప్రకటించిన ఆమిర్

Fri,July 26, 2019 03:56 PM

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పాక్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగుతానని 27ఏండ్ల ఆమిర్ ప్రకటించాడు. టెస్టు క్రికెట్లో పాక్‌కు ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. సుధీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలిగి వన్డే, టీ20లకు ఆడుతాను. వచ్చే ఏడాది జరిగే ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌తో పాటు పాక్ ఆడే ముఖ్యమైన సిరీస్‌ల్లో అద్భుతంగా రాణించాలని ఆశిస్తున్నా అని ఆమిర్ పేర్కొన్నాడు.


ఆమిర్ కేవలం 36 టెస్టుల్లోనే 119 వికెట్లు పడగొట్టాడు. తన పదునైన బంతులతో ఎంతో మంది స్టార్ బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. ఇప్పటి వరకు 59 వన్డేలాడి 77 వికెట్లు తీయగా.. 42 టీ20ల్లో 56 వికెట్లు తీశాడు. కొన్నేండ్లుగా ఆమిర్ పాక్‌కు ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్నాడు. ఆమిర్‌పై స్పాట్‌ ఫిక్సింగ్ నిషేధం ముగిసిన తర్వాత పాకిస్తాన్ జట్టులో పునరాగమనం చేసి కీలక బౌలర్‌గా ఎదిగిన విష‌యం తెలిసిందే.

2184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles