ఆసీస్‌తో టెస్టులో పాకిస్థాన్‌ గ్రాండ్ విక్టరీ..

Fri,October 19, 2018 05:42 PM

Mohammad Abbas masterclass drives Pakistan towards series victory against Australia

అబుదాబి: ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సంచలన ప్రదర్శన చేసిన పాకిస్థాన్ టెస్టు సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో పోరాడిన ఆసీస్.. పాక్‌తో డ్రా చేసుకుంది. సీమర్ మహ్మద్ అబ్బాస్(5-33, 5-62) అత్యుత్తమంగా రాణించడంతో పాక్ రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్‌ను పేకమేడలా కుప్పకూల్చి పాక్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. కెరీర్‌లో తొలిసారి 10 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. పాక్ నిర్దేశించిన 538 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 49.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటవడంతో పాక్ 373 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అబ్బాస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను దక్కించుకున్నాడు. పాక్‌కు ఇదే అతిపెద్ద టెస్టు విక్టరీ కావడం విశేషం. సిరీస్‌లో ఆసీస్ ఓటమిపాలవడంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడోస్థానం నుంచి ఐదుకు పడిపోయింది.

తొలిఇన్నింగ్స్:
పాకిస్థాన్ 282
ఆస్ట్రేలియా 145
రెండో ఇన్నింగ్స్:
పాకిస్థాన్ 400/9 డిక్లేర్డ్
ఆస్ట్రేలియా 164 ఆలౌట్‌

3805
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS