మిథాలీరాజ్ @ 20 ఇయర్స్ క్రికెట్..

Thu,October 10, 2019 07:46 AM

వడోదర: మిథాలీరాజ్.. పరిచయం అక్కర్లేని పేరు. భారత మహిళా క్రికెట్‌కే వన్నె తెచ్చిన క్రికెటర్. మిథాలీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి నిన్నటికి(బుధవారం) రెండు దశాబ్దాలు పూర్తయింది. ఈ ఫీట్ సాధించిన మొదటి మహిళా క్రికెటర్ మిథాలీ. ప్రపంచంలో ఏ దేశ మహిళా క్రికెటర్‌కు సాధ్యం కానీ ఈ రికార్డు మిథాలీ సాధించింది. సుదీర్ఘకాలం తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ.. కెప్టెన్‌గా, జట్టు సభ్యురాలిగా మిథాలీ భారత క్రికెట్‌కు చేసిన సేవలు అనిర్వచనీయం. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకుంది. నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో నాటౌట్‌గా నిలిచి, తన రికార్డును చిరస్మరణీయం చేసుకుంది. మిథాలీ 1996, జూన్ 26న ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసింది. మిథాలీ ఇప్పటి వరకు 204 వన్డేలు, 10 టెస్టులు, 89 టీ 20 మ్యాచ్‌లాడింది. వన్డేల్లో అత్యధిక మ్యాచ్‌లాడింది కూడా మిథాలీనే. ఆమె తరువాత స్థానంలో ఇంగ్లాండ్ క్రికెటర్ ఎడ్వర్డ్స్(191), జులన్ గోస్వామి(178), ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ బ్లాక్‌వెల్(144) ఉన్నారు. 2021లో జరిగే వన్డే ప్రపంచకప్ కోసం ఆమె గత నెల టీ 20 లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డేల్లో మిథాలీనే కెప్టెన్ గా కొనసాగుతోంది.


మిథాలీ ఇప్పటి వరకు టీ 20ల్లో 32 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించింది. అందులో 2012, 2014, 2016 టీ-20 ప్రపంచకప్‌లకు సారథ్యం వహించడం విశేషం. ఓవరాల్‌గా క్రికెట్‌లో అత్యధిక కాలం కొనసాగిన క్రికెటర్‌గా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. అతను 22 సంవత్సరాల 91 రోజులు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. తర్వాతి స్థానంలో శ్రీలంక దిగ్గజ ఆటగాడు జయసూర్య, పాక్ మాజీ ఆటగాడు జావేద్ మియాందాద్ మిథాలీ కన్నా ముందు వరుసలో ఉన్నారు.

960
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles