ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

Thu,November 14, 2019 11:30 AM

హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కూకట్‌పల్లిలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన ఇండోర్ స్టేడియంను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక కార్పోరేటర్లు, క్రీడాకారులు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది అభినందించదగ్గ విషయం. ఈ స్టేడియాన్ని స్థానిక క్రీడాకారులు వినియోగించుకోవాలని, తద్వారా ఉన్నత స్థానానికి చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. స్థానిక క్రీడాకారుకు ఈ స్టేడియం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.



నగర యువత షటిల్ బ్యాడ్మింటన్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నందున ఈ స్టేడియంను నిర్మించినట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఇప్పటికే షటిల్‌లో హైదరాబాద్ నుంచి చాలా మంది షటిల్ క్రీడాకారులు భారత్‌కు ప్రాతినిథ్యం వహించడం విశేషం. వారిలో సైనా నెహ్వాల్, పీవీ సింధు, శ్రీకాంత్, కష్యప్ తదదితరులున్నారు.


1016
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles