మెద్వెదేవ్‌ నాదల్‌ను తట్టుకోగలడా..!

Sun,September 8, 2019 03:05 PM

Medvedev can resist Nadal ..!

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌లో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో ఫెవరేట్‌ సెరీనా విలియమ్స్‌ కెనడాకు చెందిన బియానా ఆండ్రిస్కూ చేతిలో వరుస సెట్లలో ఓటమి పాలయింది. పురుషుల సింగిల్స్‌లోనూ ఫేవరెట్లు ఫెదరర్‌, జెకోవిచ్‌ ఇప్పటికే ఇంటిదారి పట్టగా, నాదల్‌ ఒక్కడే ఫైనల్‌ రేసులో ఉన్నాడు. అతని ప్రత్యర్థి రష్యాకు చెందిన మెద్వెదేవ్‌. భీకర ఫామ్‌లో ఉన్న మెద్వెదేవ్‌ ఈ ఏడాది వరుసగా నాలుగుసార్లు ఫైనల్స్‌ ఆడాడు. మరాట్‌ సఫీన్‌(2005) తర్వాత యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరిన తొలి రష్యా ఆటగాడు మెద్వెదేవ్‌. ఈ మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం రాత్రి 1.30కి ప్రారంభమవుతుంది. స్టార్‌స్పోర్ట్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

కాగా, ఇప్పటికే 18 గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌తో ఫెదరర్‌(20) రికార్డుకు రెండు అడుగుల దూరంలో ఉన్న రఫా ఈ మ్యాచ్‌ గెలిస్తే రోజర్‌కు మరింత దగ్గరవుతాడు. నాదల్‌కిది 27వ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ కావడం విశేషం.

484
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles