మళ్లీ మ్యాచ్ రద్దు.. రెండు జట్లకు చెరో పాయింట్

Tue,June 11, 2019 06:44 PM

Match abandoned without toss due to rain

బ్రిస్టల్: వన్డే ప్రపంచకప్‌ను వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. తాజాగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా కనీసం టాస్ కూడా వేయకుండానే ర‌ద్దైంది. ఈ వారంలో వరుణుడి వల్ల రద్దు అయిన మూడో మ్యాచ్ ఇది. వర్షం కారణంగా మ్యాచ్ జరిగే వీలు లేకపోవడంతో అంపైర్లు రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. వరల్డ్ కప్ మ్యాచ్‌లకు వరుణుడు అడ్డుపడటంతో సోషల్‌మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను అంచనా వేయకుండా టోర్నీ షెడ్యూల్ ఎలా నిర్ణ‌యించార‌ని మండిపడుతున్నారు. తర్వాతి మూడు మ్యాచ్‌లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. సోమవారం వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దైన విష‌యం తెలిసిందే.
5065
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles