మారియా ష‌ర‌పోవా స్ట‌న్నింగ్ షో

Tue,August 29, 2017 11:11 AM

Maria Sharapova stuns Simona Halep on Grand Slam return

న్యూయార్క్: మారియా ష‌ర‌పోవా స్ట‌న్ చేసింది. బ్యాన్ త‌ర్వాత గ్రాండ్‌స్లామ్‌లో గ్రాండ్ విక్ట‌రీ కొట్టింది. యూఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే వ‌ర‌ల్డ్ సెకండ్ ర్యాంక్ ప్లేయ‌ర్‌ను ఓడించింది. ష‌ర‌పోవా 6-4, 4-6, 6-3 స్కోర్ తేడాతో సిమోనా హ‌లెప్‌పై విజ‌యం సాధించింది. సుమారు 24 వేల మంది ప్రేక్ష‌కులు ఈ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించారు. డోపింగ్ కేసులో ఇర్కుకున్న ష‌ర‌పోవా దాదాపు 15 నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ మేజ‌ర్ టోర్నీ ఆడింది. ప్ర‌స్తుతం ష‌ర‌పోవా ర్యాంక్ 146. అయితే వైల్డ్ కార్డ్ ద్వారా ఆమె మెయిన్ డ్రాలో చోటు సంపాదించింది. సుమారు రెండు గంట‌ల 44 నిమిషాలు సాగిన మ్యాచ్‌లో ష‌ర‌పోవా దూకుడు ఆట‌తో ఆక‌ట్టుకున్న‌ది. రెండ‌వ రౌండ్‌లో వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 59 ప్లేయ‌ర్ టిమి బాబోస్‌ను ష‌ర‌పోవా ఢీకొంటుంది.

1522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles